పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం 

Written by telangana jyothi

Published on:

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం 

  • భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి: సమాజంలో శాంతి స్థాపన కోసం, అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా పోలిసు శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ఓపెన్ హౌస్, మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా, ఎస్పి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఖరే మాట్లాడుతూ పోలీసు అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతామని, అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాలపై ఉందని తెలిపారు.

ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. నూతన జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్, జయశంకర్ సెంటర్ మీదుగా 5 ఇంక్లైన్ నుంచి జిల్లా కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్థూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీ లో ఎస్పి కిరణ్ ఖరె స్వయంగా పాల్గొని పోలీసు సిబ్బంది, యువతలో ఉత్సాహం నింపారు.

పోలీసు సేవలపై అవగాహనకే ఓపెన్ హౌస్

పోలీస్ శాఖ అందిస్తున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిoచామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే పోలీస్ అధికారులు, ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని సందర్శించి, విద్యార్థులతో మమేకమయ్యారు. పోలీస్ శాఖ నిర్వహించే వివిధ ఆయుధాలు, అత్యాధునిక పరికరాల పట్ల అవగాహన కల్పించి, వారిలో స్ఫూర్తినింపారు. పోలీస్ శాఖ కేసుల చేధనలో ఉపయోగించే సాంకేతికత, కమ్యూనికేషన్, బాంబు డిస్పోజల్, బాంబ్ డిటెక్షన్, వివిధ ఆయుధాలు, వేలిముద్రల సేకరణ, ఇతర పరికరాల గురించి వివరించారు ఈ ఓపెన్ హౌజ్ లో వివరించారు.

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పోలిసు శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటి వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా, ముఖ్య అతిధిగా హాజరైన ఎస్పి కిరణ్ ఖరే రక్తదానం చేసి బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు, రక్తం చాలా అవసరనని అన్నారు. పోలిసు అమరవిరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో సుమారు 150 మంది పోలీసులు, యువత , ప్రజలు రక్తదానం చేసి, విజయవంతం చేయడం జరిగిందని ఎస్పి కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఏ.ఆర్) వి. శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, డాక్టర్లు నవీన్, కిరణ్, శ్రీనివాస్, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, యువత, ప్రజలు పాల్గొన్నారు.

Tj news

1 thought on “పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now