ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి
– న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవని పోలీస్ వారి హెచ్చరిక
– నూతన సంవత్సర వేడుకల పేరుతో తోటి పౌరులకు అసౌకర్యం కల్ఫించవధ్దు
– వెంకటాపురం సిఐ బండారి కుమార్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : న్యూ ఇయర్ వేడుకల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెంకటాపురం సిఐ బండారి కుమార్ తెలిపారు. సోమవారం పోలీసు శాఖ తరుపున పౌరులందరికి, ముందస్తు నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని క్రింది సూచనలను పాటించ వల్సిందిగా సి.ఐ. విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం కూడా విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాల్సిందిగా కోరారు. ముఖ్యం గా తల్లిదండ్రులు తమ యుక్త వయసు పిల్లలకు, మరీ ముఖ్యంగా మైనర్ పిల్లలకు, బైకులు, కార్లను ఇస్తే వారు ఆ వాహనాలను వేగంగా, నిర్లక్ష్యంగా, మత్తులో నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కావున ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, సాధ్యమైనంత వరకు పిల్లలను కట్టడి చేసుకొవాలని కోరారు. న్యూ ఇయర్ సందర్భంగా “డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసేందుకు, మరియు అతివేగం/ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు, త్రిబుల్ రైడింగ్ నడిపే వారి పై నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. 31వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ, పౌరులను అసౌకర్యం కలిగే విధంగా తిరిగే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. నూతన సంవత్సర వేడుకల గురించి ఎవరికి ప్రత్యేకమైన కార్యక్రమాలకు, లేదా ఈవెంట్లకు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు జారీ చేయలేదన్నారు. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించి నూతన సంవత్సర వేడుకల పేరుతో ఈవెంట్స్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తే, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. డి జె సౌండ్ సిస్టమ్స్ పెట్టి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ, వృద్ధులకు, పేషంట్లకు, పిల్లలకు ప్రాణహాని కలిగే విధంగా చేసే వారిపై కూడ కఠిన సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి, వాహనాలను/ఎక్విప్మెంట్ ల ను సీజ్ చేసి జైలుకు పంపే విధంగా చర్యలు తీసుకొన బడుతుందని తెలిపా రు. పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి పూర్తి శాంతియుత, ఆహ్లాదకరమైన వాతావ రణంలో నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపు కోవాలని సి.ఐ.బండారి కుమార్ విజ్ఞప్తి చేశారు.