బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో యోగా శిక్షణ
ములుగుప్రతినిధి:జిల్లాకేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూ ల్లో శనివారం విద్యార్థులకు యోగా ఆసనాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అంబటి కోటిరెడ్డి యోగ విశిష్ఠతను విద్యార్థులకు వివరించారు. నిత్యం యోగ ఆసనాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరకఆరోగ్యం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యా యులు, సిబ్బంది పాల్గొన్నారు.