నేడు, రేపు గ్రూప్ 2 పరీక్షకు పటిష్టమైన బందోబస్తు

నేడు, రేపు గ్రూప్ 2 పరీక్షకు పటిష్టమైన బందోబస్తు

– పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ (సెక్షన్ 144 ) అమలు

 – భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ 

భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఈ నెల 15 వ తేది (ఆదివారం), 16 వ తేది (సోమవారం) రెండు రోజులు పాటు జరిగే గ్రూప్-II రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ పరీక్షా కేంద్రాల వద్ద 163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద, ప్రజలు గుమిగూడ వద్దు అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మొత్తం భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ నందు పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు,వంటివి తీసుకువెళ్లడానికి అనుమతి ఉండదని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే ప్రధాన గేట్ వద్ద తనిఖీలు నిర్వహించే పోలీసు వారికి సహకరించగలరని పేర్కొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment