పెద్దపులి సంచరిస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలి

పెద్దపులి సంచరిస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలి

పెద్దపులి సంచరిస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలి

– వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి :  ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల ప్రజలకు పెద్ద పులి సంచారం పై అప్రమత్తంగా ఉండాలని వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే తిరుపతిరావు బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో ప్రజలను కోరారు.మండలంలోని బోధపురం, ఆలుబాక, పెంకవాగు, తిప్పాపురం, సీతారాంపురం, రామచం ద్రపురం గ్రామ శివారులలో పెద్దపులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు వ్యవసాయ పనుల నిమిత్తం, పశువుల మేతకు, ఇతర పనుల నిమిత్తం ఒంటరిగా వెళ్లకూడదన్నా రు.ఎక్కడైనా పెద్దపులి సంచరించినట్లు తెలిసిన, ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే ఫారెస్ట్ అధికారులకు కానీ, పోలీ సు అధికారులకు  సమాచారం ఇవ్వాలని తెలిపారు. పెద్ద పులిని పట్టుకోవాలని లేదా, విష ప్రయోగం చేసి చంపాలని ప్రయత్నిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమో దు చేయటం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమ త్తంగా ఉండాలని  ఎస్.ఐ.తిరుపతి రావు ప్రజలను కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment