కిలేడీ వలపు వలకు బలైన ఎస్సై హరీశ్‌..?

Written by telangana jyothi

Published on:

కిలేడీ వలపు వలకు బలైన ఎస్సై హరీశ్‌..?

– ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి తేవడంతోనే అఘాయిత్యం

– గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో బ్లాక్‌మెయిల్‌

హైదరాబాద్,తెలంగాణజ్యోతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ (29) ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయని సమాచారం.. ముళ్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన పక్కనే ఉన్న ప్రైవేట్‌ రిసార్టులో ఎస్సై హరీశ్‌ సోమవారం ఉదయం తన సర్వీస్‌  రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మర ణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రక్తపు మడుగులో విగతజీవిగా ఉన్న హరీశ్‌ మృతదేహంపై ఓ యువతి పడి రోదించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యా యి. ఘటన అనంతరం పేరూరు పోలీసులు ఆమెను అదుపు లోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి సంఘటన ఎలా జరిగింది.? ఆ సమయంలో అక్కడ ఆమె ఎందుకు ఉందనే అంశాలపై విచారించారు. ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ యువతి సూర్యాపేట జిల్లా వాస్తవ్యురాలిగా గుర్తించారు. అక్కడి పోలీసులను సంప్రదించగా సదరు యువతి గతంలో ముగ్గురు యువకులకు ప్రేమపేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తేలింది. ఈమె వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించగా అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదై నట్లు సమాచారం. సమాజంలో పలుకుబడి, ఆర్థికంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని లొంగదీసుకోవడమే పనిగా పెట్టు కున్న ఆ యువతి ఏడాది క్రితం ఎస్సై హరీశ్‌కు ఫోన్‌లో పరిచయం అయినట్లు సమాచారం. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారితీసిందని, అయితే ఆమె గురించి అసలు విషయాలు తెలియడంతో ఆమెతో పెళ్లికి హరీశ్‌ నిరాకరించాడని సమాచారం. ఈ క్రమంలోనే హరీశ్‌ కుటుంబసభ్యులు చూసిన సంబంధాన్ని చేసుకునేం దుకు అంగీకరించాడని, కానీ తనను పెళ్లి చేసుకోకుంటే రోడ్డు కీడుస్తానని, ఇప్పుడు తాను గర్భవతినని సదరు యువతి హరీశ్‌ను భయపెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఎక్కడ పరువు పోతుందోననే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎస్సై హరీశ్‌ మృతిపై తొలుత అనేక ఊహాగా నాలు వినిపించాయి. ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిడి అంటూ ప్రచారం కాగా ఆయన మరణానికి దారి తీసిన పరిస్థితులను నిగ్గు తేల్చేందుకు పోలీసు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట యువతి అసలు బండారం బయటపడింది. కాగా, ఆ యువతిని సోమవారం సాయంత్రమే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ఎస్కార్ట్‌గా ఇచ్చి దూద్యా తండాకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసు శాఖలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న హరీశ్‌ జీవితం విషాదంగా ముగిసి పోవడం కుటుంబసభ్యులను, సన్నిహితులను తీవ్రంగా కలచి వేస్తోంది.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now