సర్వీస్ రివాల్వర్‌లో కాల్చుకుని ఎస్సై మృతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఓ ఎస్సై ప్రాణాలు విడిచిన విషాద ఘటన ములుగు జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళితే.. వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రుద్రారపు హరీశ్ ఎస్సైగా విధులు నిర్వర్తి స్తున్నాడు. ఈ క్రమంలోనే వాజేడు మండల పరిధి లోని ముళ్లకట్ట బ్రిడ్జి సమీపంలో ఉన్న ఓ రిసార్ట్ లో హరీశ్ తన స ర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ములుగు జిల్లాలో నిన్న ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం లేపుతుంది, ఉన్నంత అధికారులు సంఘటన స్థలానికి చేరు కొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.