భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం బిఆర్ఎస్ కు బిగ్ షాక్.
- వెంకటాపురం జడ్పీటీసీ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రేస్ లో చేరిక.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని ములుగు జిల్లా నువ్వు వెంకటాపురం మండలంలో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీ చెందిన వెంకటాపురం జడ్పిటిసి పాలెం రమణ తో పాటు అనేకమంది సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు వెంకటాపురం వాస్తవ్యులు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల సమక్షంలో గురువారం కాంగ్రెస్ లో చేరారు. ఆయా నాయకులు,ఆ పార్టీకి వరుస రాజీనామాలు చేశారు. మాజీ ఎమ్ఎల్సీ బాలసాని లక్ష్మి నారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వెంకటాపురం జడ్పీటీసీ పాయం రమణ,మరికాల సర్పంచ్ వాసం సత్యవతి , బెస్తగూడెం సర్పంచ్, చిడెం లాలి బాబు, ఉప సర్పంచ్ మంచర్ల భిక్షపతి, బిసి మర్రిగూడెం సర్పంచ్ అట్టం సత్యవతి, ఉప సర్పంచ్ గార ఝాన్సీ రాణి, నూగురు సర్పంచ్ ఇండ్ల లలిత, మొర్రవాని గూడెం సర్పంచ్ మడకం సారయ్య, రాసపల్లి సర్పంచ్ స్వరలం సమ్మయ్య, బర్లగూడెం ఎంపిటిసి కురసం సమ్మక్క తదితరులు పార్టీ లో చేరినట్లు ప్రకటించారు. వారందరిని పార్టీలోకి సాధ రంగా ఆహ్వనించి పార్టీ కండువాలు కప్పి, స్వాగతించినట్లు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. ఇంకా అనేకమంది కార్యకర్తలు, పార్టీ నాయకులు సుమారు వెయ్యి మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పార్టీ నాయకులు మీడియా కు తెలిపారు.
1 thought on “భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం బిఆర్ఎస్ కు బిగ్ షాక్.”