అంగరంగ వైభవంగా బొప్పారం సాకేత రామచంద్ర మూర్తికి అష్టోత్తర శతనామ కీర్తనలతో స్వరాభిషేక మహాయజ్ఞం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:మహిమాన్విత దివ్య ధామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బొప్పారం లో గల సీతారామ లక్ష్మణ లలితా త్రిపుర సుందరీ హనుమత్ సమేత దివ్య ధామంలో కార్తీక మాసం ఆలయ ధర్మకర్తలు శ్రీ వూర నందకిషోర్ బాబు పుట్టినరోజు సందర్భం గా కార్తీక శుద్ధ బహుళ షష్ఠి గురువారం రోజున సాకేత రామచంద్రమూర్తి దివ్య క్షేత్రంలో ఒక బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. జై శ్రీరామ్ గాయక సమూహం, సాహితీ వేదిక తెలంగాణ వారి ఆద్వర్యంలో ఆ రామచంద్ర మూర్తికి అర్చనలు, అష్టోత్తర శతనామ కీర్తనలతో స్వరాభిషేక మహాయజ్ఞం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 9:00 ప్రారంభమైన స్వరాభిషేక మహాయజ్ఞ కార్యక్రమం 108 కీర్తనలు,5 మంగళ నీరాజనాలతో అంగరంగ వైభవంగా జరి గింది. సాయంత్రం 6:00 కొనసాగింది. ఈ సత్ కార్యక్రమం లో పెద్దపల్లి జిల్లా మంథని, భూపాలపల్లి జిల్లా కాటారం, మహ దేవ్ పూర్, మల్లారం, తాడిచెర్ల, బొప్పారం, శంకరం పల్లి, వల్లెంకుంట, చింతకాని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి వారి గాత్రంతో కీర్తనలు ఆలపించి ఈ దివ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జై శ్రీరామ్ గాయక సమూహం, సాహితీ వేదిక తెలంగాణ నిర్వాహకులు కొత్త శ్రీనివాస్ మంథని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు, పుల్లూరి నాగేశ్వర్ రచయిత గాయకులు పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగి కాటారం వారి ఆద్వర్యంలో దేవాలయ ధర్మకర్తలు వూర నందకిషోర్ బాబు -సూజన్ దంపతులు, డాక్టర్ వూర నందగోపాల్ బాబు -జయ చైతన్య దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల రామానుజాచార్యులు భక్తుల సహకారంతో ఈ సత్ భగవత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 108 కీర్తనలు పాడిన గాయనీ గాయకులను ప్రశంసా పత్రం, స్వామి వారి శేషవస్రంతో గాయకులను, వాయిద్య కారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో విజయవంతం కావడంతో చాలా ఆనందాన్ని చేకూర్చిందనీ ధర్మకర్తలు నంద కిషోర్ బాబు, నంద గోపాల్ బాబు లు సంతోషం వ్యక్తం చేశారు. భక్తి శ్రద్ధలతో జరిగిన సత్ ఈ కార్యక్రమంలో నిర్వాహ కులు పుల్లూరి నాగేశ్వర్ రావు, హట్కర్ దేవు నాయక్, కొత్త శ్రీనివాస్, ఆలయ అర్చకులు రామాచార్యులు, జయశంకర్ సారస్వత సమితి అధ్యక్షుడు గడ్డం లక్ష్మయ్య, భక్తులు, గాయనీ గాయకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల రామాచార్యులని, నిర్వాహకు లను భక్తులు ఘనంగా సత్కరించారు.