పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత చికిత్స శిబిరం
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం లోని చక్రవర్తి పల్లి గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరమును పశుగణాభివృద్ధి సంస్థ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరంలో లక్ష్మీ దేవిపేట పశు వైద్య అధికారి డాక్టర్ మహతి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా డాక్టర్ జగపతి రావు హాజరై మాట్లాడారు. రైతులకు లింగ నిర్ధారిత వీర్యము తో కృత్రిమ గర్భధారణ చేయడం వలన కలుగు లాభాలను, గర్భధారణ రేటు పెంచడానికి సూచనలను తెలిపారు. ఈ పథకంలో ఒక లింగ నిర్ధారిత వీర్య నాలిక ధర రూపాయలు 675, రైతు వాటాగా రూపాయలు 250, ప్రభుత్వం రూపా యలు 425 సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒకే పశువుకు వరుసగా రెండు ఎదలలో లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేసినప్పటికీ చూలు కట్టకపోతే రైతు 2 రెండుసార్లు చెల్లించిన వాటా ధనం రూపాయలు 500 తిరిగి రైతు ఎకౌంటు కు తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ జమ చేస్తుందన్నారు. మొదటి కృత్రిమ గర్భధారణ విఫలమై, రెండ వ కృత్తిమ గర్భధారణ ద్వారా మగ దూడ జన్మిస్తే రూపా యలు 250 తిరిగి రైతుకు జమ చేయబడును. ఈ పథకంలో నల్ల జాతి పశువులకు ముర్రా జాతి వీర్యము, తెల్లజాతి పశువులకు సాహివాల్, గిర్, హెచ్. ఎఫ్, జెర్సీ సంకరజాతుల వీర్యము అందుబాటులో ఉంటుంది. కావున రైతులు ఈ పథకమును సద్వినియోగం చేసుకొని పాల దిగుబడి పెంచి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. మేలు జాతి ఆడదొడల సంఖ్యను పెంచుకొని పశు పోషణను మరింత లాభసాటిగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధుల చికిత్స 99 పశువులకు చేయడం జరిగింది నట్టల నివారణ మందు 45 దూడలకు తాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నివారణ మందులు, 124 పశువులకు గర్భస్థ వ్యాధి నివారణ మందులు ఉచితముగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఏ ఆయిలుమల్లు, గోపాల మిత్రు లు రాజేందర్,దామోదర్,శ్రీనివాస్, ఆలేషా, పశువైద్య సిబ్బంది వేణు, తేజ వర్మ, రైతులు తదితరులు పాల్గొన్నారు.