వెంకటాపురం మండలంలో 11 వేల 261 కుటుంబాలు
సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం 18 గ్రామ పంచా యతీలలో ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే పూర్తికావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశంపై గురువారం నుండి ఆన్లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ మేరకు 32 మంది ఆపరేటర్లు ఆన్లైన్ డేటా ఎంట్రీ కార్యక్రమంలో కంప్యూ టర్ లో సమాచారం నిక్షిప్తం చేసే పనులను చేప ట్టారు. మండలంలోని 18 పంచాయతీలలో మొత్తం 11వేల 261 కుటుంబాలు కలిగి ఉండగా, సమగ్ర సర్వే బృందాలు ఆయా కుటుంబాల నుండి వివరాలు ఇంటింటికి వెళ్ళి సేకరించి నమోదు చేయగా ఆన్లైన్ ప్రక్రియను వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్, మండల పంచాయతీ అధికారి హనుమంతరావులు ఆన్లైన్ ప్రక్రియను ఎప్పటికప్పు డు పరిశీలిస్తూ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు తగు సూచనలు, సలహాలతో తప్పులు దొరలకుండా నమోదు చేయాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.