రాష్ట్రస్థాయి కలోత్సవాలకు ఎంపికైన శివ నవదీప్ 

రాష్ట్రస్థాయి కలోత్సవాలకు ఎంపికైన శివ నవదీప్ 

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ బాలుర ఉన్నత పాఠశా లకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి మద్దిరాల శివ నవ దీప్ రాష్ట్రస్థాయి కళోత్సవాలకు ఎంపికయ్యారు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థాయి యువజన కళోత్స వాల్లో పాల్గొని డ్రాయింగ్ విభాగంలో మొదటి బహుమతి శివ నవదీప్ పొందినట్లు మహాదేవపూర్ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజీరెడ్డి, టీచర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మారూమూల అటవీ ప్రాంతమైన మహాదేవ పూర్ నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా శివ నవదీప్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment