వెంకటాపురంలో ఘనంగా మహిషాసురమర్ధిని
- పూజా కార్యక్రమాలు కు తరలి వచ్చిన భక్తజనం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో దుర్గామాత ఉత్సవాల ను అంగరంగ వైభవంగా భక్తమండలి నిర్వహించింది. ఇందులో భాగంగా వెంకటాపురం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మాత ఆలయంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల సూచనల మేరకు సోమవారం మహిశాసురమర్దిని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలు తరలి వచ్చి అమ్మవారికి పూజా కార్యక్రమంలో ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు.మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి కాత్యాయని అవతారంలో అమ్మ వారు భక్తులు కు ధర్శనమిస్తారని కమిటీ తెలిపింది.