ఊరికి దూరంగా.. నిరుపయోగంగా..?

Written by telangana jyothi

Published on:

ఊరికి దూరంగా.. నిరుపయోగంగా..?

– వసతులు లేవు.. పరికరాలు రావు…

– బోర్డులకే పరిమితమైన క్రీడా ప్రాంగణాలు

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: గత ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు ఊరికి దూరంగా..  నిరుపయోగంగా మారాయి. కేవలం బోర్డులకే పరిమితమైన క్రీడా ప్రాంగణాలు గ్రామీణ క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం లేకుండా పోయింది. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలలో కనీస వసతులు, పరికరాలు లేక పట్టించుకోని పరిస్థితి నెల కొంది.అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వలక్ష్యం నిరుగా రిపోతుంది. ఉపాధిహామీ పథకం కింద లక్షలు రూపాయలు ఖర్చు చేసిన వాటికి సరైన వసతులు కల్పించకపోవడంతో క్రీడా ప్రాంగణాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. మరి కొన్ని మైదానాలు ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో క్రీడా కారులు అటు వైపు   కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్రీడా ప్రాంగణాలలో చెట్లు గడ్డి పేరుకపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మండలంలోని పలు గ్రామపంచాయతీల లో క్రీడా మైదానాల ఏర్పాటుకు అధికారులు ప్రభుత్వ స్థలా లను గుర్తించి వాటికి కేటాయించారు. మైదానాల అభివృద్ధికి ఎన్ఆర్ఆజీఎస్ నుంచి ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు ఆటలు ఆడేందుకు వీలు లేకుండా ఉన్నాయి. గ్రామాల్లో చాలా చోట్ల ఊరికి దూరంగా, చెరువు శిఖములలో, ఎత్తు వంపుల స్థలాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడంతో నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా సంబంధిత అధికా రులు క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకువచ్చి గ్రామీ ణ క్రీడాకారులను ప్రోత్సహించాలని పలువురు క్రీడాకారులు కోరుతున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now