ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులుగా బోడ రాములు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులుగా బోడ రాములు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఆదివారం బోడ రాములు విలేకరులతో మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మేడి పాపన్న, ఈ అధ్యక్ష పదవికి సహకరించిన జాతీయ అధ్యక్షులు చింత బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే దాసి మోహన్ ల కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ సభ్యులకు నాయకు లకు కులానికి అందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని ఏ పని అయినా సకాలంలో వారందరికీ అందే విధంగా చూస్తానని ఎమ్మార్పీఎస్ నాయకులకు అందుబాటులో ఉండి ప్రతిరోజు వారి సహాయ సహకారాలు అందుకుంటానని అన్నారు. ఎమ్మార్పీఎస్ మాదిగ వారందరూ రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని వారందరి కృషి ఉంటేనే మనం అందరం ముందుకు కొనసాగుతామని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో కొయ్యల నాగరాజు ,కే లక్ష్మీనారాయణ, పుల్లూరి నర్సింగ రావు,గాజర్ల రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సభ్యులు తదిత రులు పాల్గొన్నారు.