న్యాయ సేవా అధికార సంస్థ పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
– హై కోర్టు న్యాయమూర్తి, ములుగు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ లక్ష్మి నారాయణ అలిశెట్టి
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : న్యాయ సేవా అధి కార సంస్థ పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, రూరల్ ఏరియాలో చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ లేబర్ మరియు లేబర్ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలని హై కోర్టు న్యాయ మూర్తి, ములుగు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ లక్ష్మి నారాయణ అలిశెట్టి సూచించారు. శనివారం ములుగుకు వచ్చిన ఆయ నకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎస్విపి సూర్య చంద్రకళ, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పి శబరిష్ పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించి కోర్టు కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ములుగు కోర్టులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వ ర్యంలో నిర్వహించిన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడా రు. న్యాయ సేవా అధికార సంస్థ గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు చట్టాలపై వివరిం చాలని అన్నారు.న్యాయం గెలవాలన్నదే లక్ష్యంగా పని చే యాలని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, అధికా రులకు పలు సూచనలు చేశారు. జాతీయ న్యాయ సేవా అధికారం సంస్థ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఎస్ విపి సూర్య చంద్రకళ, సీనియర్ సివిల్ జడ్జి కమ్ టి.కన్నయ్య లాల్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జే.సౌక్య, ఆర్డీఓ ఎన్.వెంకటేష్, డిఎస్పి రవీందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షు డు ఎం.వినయ్ కుమార్, జనరల్ సెక్రటరీ కె.సునీల్ కుమార్, న్యాయ వాదులు, కోర్ట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.