ఇంటింటి సర్వేను పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి
– సర్వేలో ప్రతి అంశాన్ని తప్పులు లేకుండా పకడ్పందిగా నమోదు చేయాలి : డిపిఓ దేవరాజ్ ఆదేశం
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి: సమగ్ర కుటుం బ సర్వేను ములుగు జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ శనివారం నూగూరు వెంకటాపురం మండలంలోని వి.ఆర్. కె .పురం జి.పిలో పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వం ఆదేశాల అనుగుణంగా సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి అంశాన్ని కూలంకషంగా కుటుంబ సభ్యుల నుండి తెలుసుకొని తప్పులు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై సర్వే సిబ్బందికి, అధికారులకు, సూచనలు అందిం చారు.ఇట్టి సర్వేకు వెంకటాపురం మండలంలో సమస్త కుటుంబాలు మండల స్థాయి అధికారులకు, గ్రామ స్థాయి అధికారులకు సహకరించి సంబందిత వివరములను తెలుపాలని జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ కోరారు. ఆయన వెంట డివిజనల్ పంచాయతి అధికారి మహ్మూద్, మండల పరిషత్ అభివృద్ది అధికారి జి. రాజేంద్ర ప్రసాద్, వెంకటాపురం మండల పంచాయతి అధికారి ఆర్. హనుమంతరావు లతో పాటు తదితరులున్నారు.