పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు

Written by telangana jyothi

Published on:

పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు

– ప్రకాష్ రెడ్డి సన్మాన సభలో మంత్రి శ్రీధర్ బాబు 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:  కాంగ్రెస్ పార్టీలో కష్ట పడి పని చేసిన వారికే పదవులు వస్తాయని రాష్ట్ర ఐటీ పరిశ్ర మల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గురు వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం బి ఎల్ ఏం గార్డెన్ లో జరిగిన రెడ్డి గాండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిధిలుగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రెడ్డి గాండ్ల కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా చైర్మన్ గా అయిత ప్రకాష్ రెడ్డిని నియమించడం జరిగిందని, పార్టీ కోసం కష్టపడ్డవారిని గుర్తించడం జరుగుతుందని తెలి పారు. మంథ ని నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలకోసం త్వరలోనే పరిష్కారం ఉంటుందని, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేసి, ఈ ప్రాంత ప్రజలకు సాగు, త్రాగు నీరు అందించ డం జరుగుతుందని పేర్కొన్నారు.ఉన్నత చదువులు చదువు కొని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పన చేస్తామ ని హామీ ఇచ్చారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమూ నూరి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్య క్షులు గద్దె సమ్మి రెడ్డి, తెప్పల దేవేందర్ రెడ్డి, చల్ల జక్కి రెడ్డి, సింగల్విండో చైర్మన్లు చల్ల తిరుపతయ్య, తోటపల్లి ప్రశాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now