దళారులకు విక్రయించి రైతుల నష్టపోవద్దు
– సొసైటీ అధ్యక్షుడు మోహన్ రావు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించు కొని రైతులు లబ్ధి పొందాలని వెంకటాపురం పిఎసిఎస్ అ ధ్యక్షులు చిడెం మోహన్ రావు కోరారు. బుధవారం పిఎసిఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని, వ్యవసాయ మార్కెట్ కమి టీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కొంత మంది దళారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తు న్నారని, ఫలితంగా రైతాంగం నష్ట పోతున్నారన్నారు. ప్రభు త్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకొని మద్దతు దర పొందా లని కోరారు. పిఎసిఎస్ ఆధ్వర్యంలో మండలంలో 5 కొను గోలు కేంద్రాలనుఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ కార్యదర్శి ఆర్. వి .వి. సత్య నారాయణ, మాజీ జడ్పిటిసి పాయం రమణ ,సొసైటీ డైరెక్టర్ పల్నాటీ ప్రకాష్ రావు, రైతులు జక్కుల సమ్మయ్య, చిడెం శివ, సుద్ద పల్లి సత్యనారాయణ, మద్దుకూరి ప్రసాద్, సెంట ర్ ఇంచార్జ్ సుధారాణి, సిబ్బంది తోట పూర్ణ, సిబ్బంది రాంప్ర సాద్ తదితరులు పాల్గొన్నారు.