ఇద్దరు మావోయిస్టు సభ్యుల అరెస్ట్

Written by telangana jyothi

Published on:

ఇద్దరు మావోయిస్టు సభ్యుల అరెస్ట్

– పేలుడు పదార్థాలు స్వాధీనం

– వివరాలు వెల్లడించిన ఎస్పీ శబరీష్

– బ్రాహ్మణపల్లి చెక్ పోస్టు వద్ద అదుపులోకి

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : మావోయిస్టు అగ్ర నేతల ఆదేశాల మేరకు మావోయిస్టు సభ్యురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి అవసరమైన సామాగ్రితో వెళ్తుండగా ములుగు జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి చెక్ పోస్టు వద్ద సభ్యురాలితోపాటు కొరియర్ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ తెలిపారు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. ఈనెల 31న పక్కా సమాచారం మేరకు బ్రాహ్మణపల్లి చెక్ పోస్టు వద్ద మంగపేట ఎస్సై టీవిఆర్ సూరి బాంబు స్క్వాడ్, క్లూస్ టీం, సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహి స్తుండగా ఛత్తీస్ఘడ్ రాష్ర్టం సుకుమ జిల్లా దొరల కోయ గ్రామానికి చెందిన నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యు రాలు కడతి కమల, బీజాపూర్ జిల్లా కోటగూడ గ్రామానికి చెందిన కొరియర్ వోయం మంగ్లు మణుగూరు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తూ పట్టుబడ్డారు. వారిని అదుపు లోకి తీసుకొని సోదా చేయగా సంచిలో పేలుడు సామాగ్రి, విప్లవ సాహిత్యాలు లభించాయి. వారిని విచారించగా మావో యిస్టు అగ్రనాయకులైన బడే చొక్కా రావు అలియాస్ దామో దర్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకన్నల ఆదేశాల మేరకు కడితి కమలను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అనంతరం మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులు తీసుకొని బీజాపూర్ రావాల్సిందిగా ఆదేశాలున్నట్లు పట్టుబడ్డ నిందితులు ఒప్పుకున్నారు. అందుకుగాను భద్రాచలంలో కమలకు చికిత్స అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో భద్రాచలం నుంచి ఇరువురు ఆటోలో వచ్చి బ్రాహ్మణపల్లి చెక్పోస్ట్ వద్ద దిగి అక్కడి నుంచి ఏటూరునాగారం మీదుగా బీజాపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డట్లు ఎస్పీ తెలిపారు. కాగా, వారి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 2డిటోనేటర్లు, కార్ డెక్స్ వైర్, 5 జిలిటన్ స్టిక్స్, 6 పెద్ద బ్యాటరీ సేల్స్, 2 పెన్ డ్రైవ్, 2 పెన్ డ్రైవ్ లు, విప్లవ సాహిత్యాలు, ఒక సెల్ఫోన్ దొరికినట్లు వివరించారు. మావో యిస్టు పార్టీలో పని చేస్తున్న వారు పోలీసుల ఎదుట స్వచ్ఛం దంగా లొంగిపోవాలని, తమ కుటుంబంతో కలిసి సుఖంగా జీవించాలని ఎస్పీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. లొంగి పోయిన మావోయిస్టులకు నగదు ప్రోత్సాహకంతో పాటు కుటుంబ పోషణకు సహకరిస్తామని తెలిపారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now