వెంకటాపురం, వాజేడు మండలాల ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం.
– నూతన కార్యవర్గం ఎన్నిక
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల ఎలక్ట్రానిక్ మీడి యా జర్నలిస్టుల సమావేశం మంగళవారం వెంకటాపురం లోని ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించారు. అక్రిడేటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సమావేశం లో పాల్గొన్నా రు.ఈ సమావేశంలో విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న, సమ స్యలను, ఇబ్బందులను కూలంకషంగా చర్చించుకున్నారు. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు కల్పిం చే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా సమిష్టిగా కృషి చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిం చారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు నూతన అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని, నూతన ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే రాయితీలు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. అనంతరం వెంకటాపురం వాజేడు మండలాల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గాన్ని సమావేశం హర్షధ్వనాల మద్య ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అధ్యక్షులుగా బేతంచెర్ల అశోక్ (ఎన్టీవీ) కార్యదర్శిగా అనుముల కృష్ణ (హెచ్.ఎం.టీవీ) లను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. కార్యవర్గ సభ్యులుగా కె.సంతోష్ కుమార్, జి. అశోక్, పి.సాయి, సమ్మయ్య, సాంబశివరావు, మహేష్, అనిల్, రవి సత్యసాయి, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.