సులభతరంగా బడ్డీ కొట్లు ట్రాక్టర్ తో తరలింపు.
– పేద చిరు వ్యాపారులకు ఊరట.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రోడ్ల పక్కన రద్దీప్రాంతాల్లో బడ్డీ కొట్లు పెట్టుకొని చిరు వ్యాపారంతో జీవన పోరాటం చేసే పేద జీవులకు బడ్డీ లను ఆ ప్రాంతంలో వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో మరో ప్రాంతానికి బడ్డీని తరలించడం ఆర్దికపరమైన ఇబ్బందులతో కూడుకుంది. సులభతరమైన, అతి తక్కువ ఖర్చుతో ఒక వీధి నుండి మరో వీధికి ఆయా బడ్డీ ల యజమానులు కోరిన ప్రాంతానికి తరలించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్టర్ పై లాక్కొని వెళ్లి మ్యాన్ పవర్ లేకుండా తరలించే పద్ధతిని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం కనకదుర్గమ్మ గుడి సమీపంలోని వెల్డీంగ్ సర్వేశ్వరరావు తయారు చేశాడు. గతంలో ఒక వీధి నుండి మరో వీధికి రోడ్డు పక్కన బడ్డీని తరలించాలంటే బడ్డీ కొట్టు యజమానులు కూలీలతో బడ్డీ నాలుగు కోళ్లకు టైర్లు తలగించి గట్టి కర్రలతో భుజంపై మెసుకుని హైలెస్స అంటూ కూలీలు మోసేవారు. దీనికి ఆయా దూరాన్ని బట్టి ఐదు వేల రూపాయలకు పైగా కూలీల కు చార్జీలు చెల్లించేవారు. అంతేకాక రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు కూడా నెలకొనేవీ. దీంతో వెల్డింగ్ సర్వేశ్వరావు అనే శ్రమజీవి జాకివీల్, ట్రాలీ లిఫ్టింగ్ టెక్నాలజీ అనే విధానం తో ఒక వీధి నుండి మరో వీధికి కూలీలతో పని లేకుండా కేవలం రెండు మూడు గంటల్లో బడ్డీ యజమానులు , చిరు వ్యాపారులు చెప్పిన చోట బడ్డీని సురక్షితంగా రవాణా చేస్తున్నారు. చిరు వ్యాపారుల జీవన పోరాట ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని, బ్రతుకు పోరాటం చేస్తున్న చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తూ, కేవలం రెండు మూడు వేల రూపాయలకే ఆయా దూరాన్ని బట్టి నామమాత్రపు రవాణా చార్జీలు తీసుకొని, చిరు వ్యాపారులకు సహాయ సహకారాలు అందిస్తున్న వెల్డింగ్ సర్వేశ్వరరావును పలువురు అబినందిస్తున్నారు. బడ్డీ కొట్టు వ్యాపారుల పట్ల ఆశాదీపంగా జాకీ విల్ ట్రాలీ లిఫ్టింగ్ టెక్నాలజీతో బడ్డీ కోట్లు తరలించడం పట్ల పలువురు చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.