అట్టహాసంగా ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ
– స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే పంపిణీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం అట్టహాసంగా ప్రారంభిం చారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకీ వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్నీ తొలిసారి నిర్వహిస్తున్నది. అయితే కేవలం స్వయం సహాయక సంఘా లలో సభ్యులుగా వున్న మహిళలకు మాత్రమే చీరలను పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెంకటాపురం మండలంలో 701 స్వయం సహాయక డ్వాక్రా సంఘాలు ఉండగా ఆయా సంఘాల్లో 7 వేల 205 మంది మహిళా సభ్యులు ఉన్నారు. మొదటి పేస్ లో 6 వేల120 మంది మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేసేందుకు మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు చీరల ను అందజేశారు. ప్రస్తుతం 85 శాతం మందికి మాత్రమే బతుకమ్మ పండుగ చీరలు మంజూరయ్యాయని వెంకటా పురం సెర్ఫ్ ఏపిఎం కరుణాకర్ తెలిపారు. ఈనెల 9వ తేదీ నాటికి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయా లని ఉన్నతాధికారు ఆదేశంపై ఆయా గ్రామాల వి.ఓ.ఏ.లు సిబ్బంది, స్వయం సహాయక డ్వాక్రా గ్రూపుల సభ్యులను ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో గుర్తించి చీరెలు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది రకాల డిజైన్లతో ఉన్న చీరలు మొదటి ఫేసులో మంజూరయ్యాయి. ఏజెన్సీ ప్రాంతం లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గ్రామ పంచాయతీ లలో నిర్వహిస్తుండగా పెద్ద సంఖ్యలో మహిళలు ఆయా పంచాయతీలవద్దకు వచ్చి చీరలను తీసుకొనెందుకు క్యూలు కడుతున్నారు. గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ సందడి నెలకొన్నది.సోమవారం వ్యవసాయ పనులకు బతుకమ్మ చీర ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా అంతరాయం ఏర్పడింది.