ప్రధాన రహదారిపై గోతులు త్రవ్వారు.. పూడ్చడం మరిచారు…
– ఆర్ అండ్ బి అధికారుల నిర్వాకం
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : వెంకటాపు రం చర్ల ప్రధాన రాష్రీయ రహదారి నెంబర్ 12 పై ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అదికారులు క్వాలిటీ కంట్రోల్ అధికారుల పరీక్షల నిమిత్తం, వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ నుండి ప్రధాన రహదారిపై ప్రతి కిలోమీటర్ కు మూడు గోతులు చొప్పున ఆర్. అండ్ బి వారం రోజుల క్రితం తవ్వించారు. ఆయా రహదారిపై మెటల్ సైజు, ఇతర సాంకేతిక ఇంజనీరింగ్ పరిశీల న నిమిత్తం క్వాలిటీ కంట్రోల్ అధికారులు కోసం తవ్విన గోతులు ప్రమాద బరితంగా మారాయి. రెండు సంవత్సరాల క్రితం రోడ్డు మరమ్మతు లు నిర్వహించి, బీ.టీ వేసిన ప్రముఖ కాంట్రాక్టర్ ఫైనల్ బిల్లులను ఆమోదించేందుకు, ఆర్ అండ్ బి క్వాలిటీ కంట్రోల్ అధి కారులు పరిశీలన నివేదిక కోసం సుమారు పది అంగుళాలు వెడల్పు, అడుగు లోతు తో వరుసగా మూడు గోతులు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. గోతులు త్రవ్వి వారం రోజులు పైగా అయినా పూడ్చక పోవటంతో ద్విచక్ర వాహనాలతో పాటు, పశువులు, గొర్రెలు, మేకలు కిలోమీటర్ కు మూడు గోతులలో పడీ కాళ్లు విరిగిపోతున్నాయి. అయినా కానీ ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ లాభం కోసం పర్సెం టేజీలు తీసుకొని, ప్రజా భథ్రతను పట్టించుకోకుండా వది లేశారని, మూగజీవాలు బలవుతున్నాయని, అంతేకాక ద్వి చక్ర వాహనాలు ఇతర చిన్న వాహనాలు కిలోమీటర్ కు 3 గోతులు పథకం లో పడి ప్రమాదాలకు జరుగుతున్నాయని ప్రజలు తెలిపారు. ములుగు జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి ఉన్నత అధికారులు వెంటనే స్పందించి, జగన్నాధపురం వై జంక్షన్ నుండి సుమారు 45 కిలోమీటర్ల పొడవునున్న ఎదిర వరకు గోతులను పూడ్చివేయాలని, నిర్లక్ష్యంగా వదిలేసిన ఆర్ అండ్ బి అధికారుల పై శాఖాపరమైన చర్యలు తీసుకో వాలని, రాకపోకలు సాగించే ప్రజలు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.