ఇల్లు కోల్పోయిన వృద్ధురాలు కుటుంబానికి సహాయం
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బుర్రవానిగూడెం పంచాయతీ అబ్బాయి గూడెం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంగరాజు మల్లక్క అనే వృద్ధురాలు ఇల్లు కుప్పకూలి పోవ టంతో నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న చేయూ త స్వచ్ఛంద సేవా సంస్థ,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లు దాతల సహకారంతో బరకం, గిన్నెల సెట్, 25 కేజీ బియ్యం, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్, కొప్పుల వినోద్, రామకృష్ణ, బొల్లె శ్రీకాంత్, బంధ రవి కుమార్, తోట దుర్గాప్రసాద్, బంధ హినోద్, కుమార్ బొల్లి బసవయ్య, బొల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.