విగ్నాలు తొలగించు వినాయకా
– వీవర్స్ కాలనీలో మహా అన్నదానం
ములుగు ప్రతినిధి : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ములుగు లోని వీవర్స్ కాలనీలో గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో విగ్ననాయకునికి భక్తులు పూజలు చేసి నైవేద్యం సమర్పిం చారు. వలుపదాసు స్వప్న సతీష్ దంపతులు, దుబాసి వినయ్ కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దాతలుగా వ్యవహరించి భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. గణపేశ్వరుని పూజించడం ద్వారా విగ్నాలు తొలగి కుటుంబా లు సంతోషంగా ఉంటాయని అర్చకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బాసాని రాంమూర్తి, చిందం రాయమల్లు, దువాసి రమేష్, కొండి సదానందం, కొండి రవి, గుర్రం శ్రీధర్, పౌడాల ఓంప్రకాష్, కొండి మహిపాల్, చిందం చందు, స్నేహిత్, నామాల సాయి, అంకం సంజీవ్, కందగట్ల భాస్కర్, నిరంజన్, ఏళ్ల మధు, ఒద్దుల రాజశేఖర్, చిట్యాల అనిల్, పోసాని భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.