మానవత్వం చాటుకున్న వాజేడు ఎస్సై హరీష్
తప్పిపోయిన వృద్ధురాలు – క్షేమంగా బంధువులకు అప్పగింత
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఆళ్ళపల్లి గ్రామానికి చెందిన అబ్బ మహాలక్ష్మి వృద్ధురాలు తప్పిపోయి ములుగు జిల్లా వాజేడు మండలం లోని జగన్నాధపురం గ్రామం చేరుకుంది. రహదారి పక్కనే ఉన్న పశువుల పాకలో వుంటూ భారీ వర్షాలు, చలితో వణు కుతూ మూలుగుతుండగా,రహదారి వెంట వెళ్లే ప్రజలు వృద్ధు రాలు యొక్క దీనావస్థను వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ కు తెలియపరిచారు. దీంతో వెంటనే స్పందించిన వాజేడు ఎస్సై హరీష్ తన సిబ్బందితో వృద్ధురాలు వద్దకు చేరుకుని ఆహారం, మంచినీరు అందించి, వృద్ధాప్యాన్ని గౌరవి స్తూ, నెమ్మదిగా ఆమె నుండి తమ స్వగ్రామం యొక్క వివరా లు సేకరించారు. వెంటనే భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి ప్రాంతానికి ఆమె యొక్క సమాచారాన్ని తెలియప రిచారు. అప్పటికే మహాలక్ష్మి బంధువులు అమే కోసం వెతుకులాట ప్రారంభించారు. వాజేడు పోలీస్ స్టేషన్ నుండి సమాచారం రావడంతో ఆగమేఘాలపై బంధువులు వాజేడు చేరుకున్నారు. చలితో గజ గజ వణుకు తున్న ఆమెకు దుస్తులు, దుప్పటి అందించి, క్షేమంగా బంధువులకు అప్పగిం చారు. 70 ఏళ్ల ముసలమ్మను కాపాడి క్షేమంగా ఆమె బంధు వులకు అప్పగించి మానవత్వం చాటుకున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ ను పలువురు అభినందించారు .