నేటి నుండి బొగత జలపాతం సందర్శనకు అనుమతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం లో తెలంగాణ నయాగారాగ పేరు గాంచిన బొగత జలపాతం సందర్శనకు శనివారం నుండి అనుమతి ఇచ్చినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా ఉన్నతాధికారుల ఆదేశంపై బొగత జలపాతం పర్యాటకుల సందర్శనలను నిలిపివేశారు. భారీ వర్షాలు, గోదావరి వర దలు తగ్గుముఖం కావటంతో ఉన్నతాధికారుల ఆదేశంపై శనివారం ఉదయం నుండి జలపాతానికి పర్యాటకుల సంద ర్శనను అనుమతిస్తున్నట్లు వాజేడు ఎఫ్.ఆర్.ఒ. తెలిపారు.