ఆపద సమయంలో అండగా ఉంటాం
– కార్యకర్తల ధైర్యం మంత్రి సీతక్క
– జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి
మంగపేట, తెలంగాణ జ్యోతి: ఆపద సమయంలో అండగా ఉంటామని, కాంగ్రెస్ కార్యకర్తల ధైర్యం మంత్రి సీతక్క అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలం లోని కొత్త మల్లూరు గ్రామంలో ఇటీవల మరణించిన బట్ట సతీష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మృతుడు సతీష్ సతీమణి బట్ట నిర్మల కు రూ.2 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఆపద సమయంలో ఉన్నవారిని ఆదుకుంటామని అధైర్య పడవద్దని కాంగ్రెస్ పార్టీ తరుఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందర్లపాటి శ్రీనివాస్ విరాళంగా ఇచ్చిన 25 కేజీల బియ్యాన్ని సాంబశివరెడ్డి సతీశ్ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్త మల్లూరు కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మాటూరు నరసింహారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు బట్ట రామారావు, కాంగ్రెస్ నాయకులు చందర్లపాటి శ్రీనివాస్, మాటూరు పరమేశ్వర రావు, మాటూరి ప్రశాంత్, బట్టా సంతోష్, లతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.