వెంకటాపురం ఎస్బిఐ కు కొత్త ఏ.టీ.ఎం. మిషన్
– ఖాతాదారులకు తీరనున్న కష్టాలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన ఏటీఎం కేంద్రం గత కొంతకాలంగా సక్రమంగా పనిచేయక ఖాతాదా రులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం పనిచేయక పోవడంతో తరచూ బ్యాంకులో ఖాతాదారుల రద్దీ ఏర్పడు తున్నది. సుమారు పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఏ.టీ.ఎం. మిషన్ మరమ్మతులకు గురవడంతో పాటు, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడం తో ఏటీఎం ఖాతాదారులకు సక్రమమైన సేవలు అందటం లేదు. దీంతో ఎస్బిఐ ఏటీఎం ఎనీ టైం మనీగా కాకుండా, ఎనీ టైం మరమ్మత్తుల కేంద్రంగా ఉందని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఎస్బిఐ ఉన్నతా ధికారులు బుధవారం ఉదయం వెంకటాపురం బ్యాంకుకు ఏటీఎం మిషన్ పరికరాలు వాహనం లో తీసుకువచ్చారు. బ్యాంకు మేనేజర్ అధికారుల సమక్షంలో కొత్త ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసు అధికారుల ఆదేశాలపై ఉదయం నుండి సాయంత్రం వరకు బ్యాంక్ పని వేళలలో వరకు మాత్రమే ఏటీఎం తెరిచి ఉంచే విధంగా గతంలోనే ఆదేశాలు జారికాగ అవే ఆదేశాలు నేటికీ అమల్లో వున్నాయి.నూతన ఏటీఎం కొత్త మిషన్ అమర్చ డంతో ఖాతాదారులు, పలువురు బ్యాంక్ అధికారులకు తమ కష్టాలు గట్టేక్కుతాయని, ఏటీఎంను త్వరితగతిన అందు బాటులో కి తేవాలని విజ్ఞప్తి చేషారు. నూతన మిషన్ ఏర్పాటు చేసిన నందుకు ఎస్బిఐ అధికారులకు ఖాతా దారులు అభినందనలు తెలిపారు.