మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Written by telangana jyothi

Published on:

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

– విధ్యే లక్ష్యంగా ముందుకు సాగాలి. 

– వెంకటాపురం సి.ఐ.బండారి కుమార్. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కు విధ్యార్ధులు దూరంగా ఉండాలని, విధ్యే లక్ష్యంగా, విద్యార్థులు ముందుకు సాగాలని, ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ కోరారు. శుక్రవారం వెంకటాపురం జునియర్ కాలేజీ లో మాదకద్రవ్యాల కు వ్యతిరేకం గా, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల కు వ్యతిరేకంగా విధ్యార్ధు లకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. నేటి సమాజం లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కు అలవాటు పడి న యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా వుండాలని, వాటి దుష్ఫలితాలు బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశలతో పెంచి పెద్ద చేసారని, విధ్యే లక్ష్యంగా ముందుకు సాగి, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో, బంగారు బాటలు వేసుకోవాలని, కుటుంబ పోషణకు సహాయకులుగా ఎదగాలని ఆశిస్తుంటారని, అటువంటి కుటుంబాల్లో నుండి వచ్చిన విద్యార్థులు, యువత తెలిసో తెలియకో, మాదక ద్రవ్యాలు పట్ల ఆకర్షితులు కావద్దని కోరారు. బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని విద్యార్థు లకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో గంజాయి మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా యువత వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. ముందు జాగ్రత్తగా విద్యా ర్థులు వాటికి దూరంగా ఉండి, తల్లిదండ్రులకు, కాలేజీకి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని, ఈ సందర్భంగా సి.ఐ.కుమార్ కోరారు. ఈ కార్యక్రమం కాలేజీ ప్రిన్సిపల్ విజయ కుమార్ అధ్యక్షతన జరిగింది. వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కొప్పుల తిరుపతిరావు, అకాడమిక్ ఇన్చార్జి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, హెచ్.ఎం. బి.శ్రీ నివాస్ , కళాశాల స్టాప్ సీనయ్య, ఆదిలక్ష్మి, రామక్రిష్ణ , రాంబాబు, రమేష్, రోహిణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now