పోలీస్ ల ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని ప్రతి గ్రామం నుంచి ఒక్కోక్క టీం చొప్పున పోలీస్ శాఖ నిర్వహించే వాలీబాల్ టోర్నీలో పాల్గొనాలని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే తిరుపతి రావు ఒక ప్రకటనలో కోరారు. ఈ టోర్నీలో గెలుపొందిన మొదటి మూడు టీం లకు తగు బహుమతులు అందజేస్తా మన్నారు. అదేవిధంగా ఆ తర్వాత ఏటూరునాగారం పోలీస్ సబ్ డివిజన్ స్థాయిలో జరిగే టోర్నమెంట్, అనంతరం జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం ఉంటుం దన్నారు. వాలీబాల్ టీమ్స్ శుక్రవారం నుండి వెంకటాపురం పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవా లన్నారు.
రిజిస్ట్రేషన్ ల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :
ఎస్.ఐ. వెంకటాపురం 8712670098,
హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య 98486 19971,
పోలీస్ స్టేషన్ వెంకటాపురం నెంబర్ 8712670098 లలో టీములు సంప్రదించాలని కోరారు.