తగ్గినట్టే తగ్గి ఆకస్మికంగా పెరిగిన గోదావరి
– రహదారుల పైకి చేరిన వరద నీరు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : గోదావరి వరద తగ్గినట్టే తగ్గి, శుక్రవారం మధ్యాహ్నం నుండి మళ్లీ వరద నీటిమట్టం వేగంగా పెరిగిపోతుండంటంతో పల్లెపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలు, గోదావరి వరదలతో సతమతమవుతున్న ప్రజలకు, బుద గురు వారాల్లో గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆకస్మికంగా శుక్ర వారం మధ్యాహ్నాం నుండీ ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తిరిగి గోదావరి వరద నీటిమట్టం వేగంగా పెరిగిపోయింది. దీంతో శుక్రవారం సాయంత్రం నుండి వెంకటాపురం టు చర్ల, ఎటునాగారం టు చతిస్గడ్ బీజాపూర్ 163 జాతీయ రహదారి టేకులగూడెం వద్ద రహదారులపైకి గోదావరి వరద నీరు ముంచేత్తి వేసింది. వెంకటాపురం టు చర్ల రహదారిలోని భోదాపురం, కొండా పురం వాగు వంతెన పైకి సుమారు రెండు అడుగుల గోదారి వరద నీరు చేరుకుంది. అలాగే వీరభద్రారం వద్ద కుక్క మాకు వంతెన పాలెం గ్రామ సమీపంలో గోదావరి వరద నీరు వంతెన వద్ద రహదారిపైకి చొచ్చుకు వచ్చింది. అనేక వాగులు గుండా వరద నీరు రావడంతో పల్లపుప్రాంతాలన్నీ జలమ యం అయ్యారు. గోదావరి లంక ల భూముల్లోకి, మేతలకు వెళ్లిన వందలాది పశువులు వెంకటాపురం, చొక్కాల ,పాత్ర పురం, బెస్తగూడెం, మరికాల, ఇంకా గ్రామాలకు చెందిన వంద లాది పశువులు గోదావరి మధ్యలో లంకల భూముల్లో మేతకు వెళ్ళి చిక్కుకుపోయాయి.