క్షేత్ర స్థాయిలో పర్యటించి మారుమూల గ్రామాలలో వరద సహాయక చర్యలు పరిశీలన – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

Written by telangana jyothi

Published on:

క్షేత్ర స్థాయిలో పర్యటించి మారుమూల గ్రామాలలో వరద సహాయక చర్యలు పరిశీలన – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

– విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొడానికి జిల్లా యంత్రాంగం సర్వం సన్నదం :జిల్లా ఎస్పి కిరణ్ ఖరే

– ఛత్తీస్ ఘడ్ సరిహద్దు గోదావరి పరివాహక ప్రాంతాలలో కలెక్టర్, ఎస్పీ పర్యటన

పలిమెల నుంచి తెలంగాణ జ్యోతి ప్రత్యేక ప్రతినిధి : వరద సహాయక క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడానికి మారు మూల గ్రామాలలో పర్యటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం పలిమెల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి పర్యటించారు. మహదేవ్ పూరు మండలంలోని పెద్దాంపేట వాగు వంతెనను పరిశీలించి అక్కడి నుండి జిల్లాలో అత్యవసర పరిస్థితులలో ఉపయోగించే వాటర్ బోట్ పనితీరును పరిశీలించి గోదావరిలో బోటులో ప్రయాణించి గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుండి ఛత్తీస్ ఘడ్ సరిహద్దు మారుమూల గ్రామమైన దమ్మురు లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలు వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మారుమూల ప్రాంతాలలో పర్యటించడం జరిగిందని అన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు అధికారులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ తాయని, తద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవ డంతో పాటు విపత్తుల సమయంలో యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇలాంటి పర్యటనలు వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందని, తద్వారా పరిష్కరించడానికి అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. పలిమెల మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, గిరివికాస్ పథకం ద్వారా బోర్లు మంజూరు చేసినప్పటికీ త్రి పేస్ కరెంట్ సరఫరా లేదని, ప్రభుత్వ పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారని దమ్మూరు గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కు తెలుపగా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి త్రి పేస్ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలిమెల మండల కేంద్రంలో 65 లక్షల వ్యయంతో సమీకృత ప్రభుత్వ కార్యాల యాల సముదాయలు నిర్మాణం, కోటి 43 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. పలిమెల మండల కేంద్రంలో అధికారుల నివాసాల నిర్మాణాలకు స్థల సేకరణ చేసి ప్రతిపాదనల పంపాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

క్షేత్ర స్థాయిలో పర్యటించి మారుమూల గ్రామాలలో వరద సహాయక చర్యలు పరిశీలన - జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ… 

ఆత్యధిక వర్షపాతం నమోదవుతుందనీ జిల్లాలో గోదావరి నది తో పాటు ఇతర వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నా యని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలో 10 మంది సుశిక్షితులైన సిబ్బందితో వాటర్ బోట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అత్యవసర పరిస్థి తులలో వాటర్ బోట్ ఉపయోగించి రక్షణ చర్యలు చేపట్టవ చ్చని అన్నారు. దమ్మూరు లాంటి మారుమూల గ్రామాలలో ప్రజలు తమ పిల్లలను ఉత్తమ చదువులు చదివించాలని బాగా చదువుకొని గ్రామానికి మంచి పేరు తేవాలని తెలిపా రు. మంచి విద్యతోనే భవిష్యత్ బాగుంటుందని ఎస్పీ తెలిపా రు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ రాం మోహన్ రెడ్డి, తహసిల్దార్ హేమ, ఎంపిడిఒ శ్రీనివాస్, పంచాయితి రాజ్ డి.ఈ సాయిలు, ఎస్.ఐ లు పవన్ ,తమాషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now