రెండో ఏఎన్ఎం ముత్తక్క కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
– ఏ ఐ టీ యూ సీ ఆధ్వర్యంలో వర్షం లో తడుస్తూ భారీ ధర్నా
కాటారంప్రతినిధి, తెలంగాణ జ్యోతి: జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని మహ ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రెండవ ఏ ఎన్ ఎం గా పనిచేస్తున్న చీడం ముతక్క ఇటీవల చనిపోగా, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకొని 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాటారం అంబేద్కర్ సెంటర్ వద్ద రెండవ ఏ ఎన్ ఎంలు అందరూ కలిసి వర్షంలో తడుస్తూ భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా రెండవ ఏ ఎన్ ఎం లుగా విధులు నిర్వర్తిస్తున్న వీరిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకుండా చోద్యం చూస్తుందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఏఎన్ఎంల బతుకులు మాత్రం మారడం లేదన్నారు. వైద్య శాఖలో పని చేస్తూ అందరికీ వైద్య పరంగా సేవ చేస్తూ వారి ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వానికి వారి మీద కనికరం లేదన్నారు. గత ప్రభుత్వంలో రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని సమ్మె చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు సంఘీభావంగా వచ్చి మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని రెగ్యులరైజేసషన్ చేస్తామని, మీకు హెల్త్ కార్డులు ఇస్తామని, ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా రెగ్యులరైజేషన్ చేస్తామని హామీలు ఇచ్చిందన్నారు. ఆ హామీలు ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని అన్నారు. అదేవిధంగా ఇక్కడున్న జిల్లా యంత్రాంగం కూడా ముత్యక్క మృతి పట్ల సానుభూతి ప్రకటించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ముత్తక్క కుటుంబానికి వెంటనే ప్రభుత్వం 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎంలు సరళ, శ్యామ ల, సామలత, పార్వతి, విజయ, సునీత, సుజాత, భారతి, సంధ్య, వెంకటమ్మ, స్వప్న, రజిత, అనసూయ, శ్రీలత, యాద లక్ష్మి, దీన, భాగ్యలక్ష్మి తో పాటు కాటారం, మహ ముత్తారం, తాడిచెర్ల, అంబట్పల్లి, కాళేశ్వరం పీ హెచ్ సీ లలో పనిచేస్తున్న రెండవ ఏ ఎన్ ఎం లు, కాంటిజెంట్ వర్కర్లు పాల్గొన్నారు.