లక్ష్మీదేవి పేట, నర్సింగాపూర్ లో అమ్మ మాట – అంగన్వాడి బాట
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : మండలంలోని లక్ష్మీదేవి పేట, నర్సింగాపూర్ గ్రామాల అంగన్వాడి టీచర్లు కొండ మాధవి, మధ్యల సంధ్య, ఎర్రబెల్లి సరోజన , దిగిని సబిత, బానోత్ రజిని, ఇంచర్ల గీత, ఆధ్వర్యంలో గ్రామంలోని హాబిటేషన్ కూడలి లో ర్యాలీగా వెళ్లి అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలకు ఇటీవల ఒక కొత్త ఒరవడి కి శ్రీకారం చుట్టారు.మూడు సంవత్సరాల పైబడిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడిలో చేర్పించాలన్నారు. ఐదు సంవత్సరాలు దాటిన విద్యార్థులను సమీప ప్రాథమిక పాఠశాల లలో చేర్పించాలని వారు కోరారు. అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం ఈనెల 15 నుండి 20 తేది వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపేట ప్రధానోపాధ్యా యులు, నర్సింగాపూర్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ సర్వర్ అహ్మద్ , ఆయా గ్రామాల ఉపాధ్యాయులు వివోలు, పొలం లక్ష్మీప్రసన్న, చిర్ర స్వర్ణలత పంచాయితీ సెక్రెటరీ అనిత , వీవో అధ్యక్షురాలు రమాదేవి , అంగన్ వాడి ఆయా భవాని ఆయా, కారబర్ కార్తీక్, కళ్యాణి, శ్రీలేఖ, వైష్ణవి, వాణి, నిహారిక, అశ్విని, స్రవంతి, వినోద, అంగన్వాడి విద్యార్థుల తల్లిదం డ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.