రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పొదెం వీరయ్య నియామకం.
– వెంకటాపురంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా భద్రాచలం మాజీ శాసనసభ్యులు, ఏఐసిసి కార్యవర్గ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య ను ప్రకటించడంతో మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. మండల కేంద్రం లోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లా డుతూ దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న పొదెం వీరయ్య ను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పొదెం వీరయ్య చేసిన సేవలను అధిష్ఠానం గుర్తింపు తో సముచితమైన గౌరవం తో , ప్రభుత్వం మారుమూల ప్రాంతా ల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేసేలా కార్యచరణ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిడెం శివ, జిల్లా ఉపాధ్యక్షులు మన్యం సునీల్ బాబు, ఎంపీటీసీ గారపాటి రవి, ఎడ్ల క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.