లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– వరదల సమయంలో చాపల వేటకు వెళ్లకూడదు,

– ఎస్సై ఎస్కే తాజుద్దీన్,

తెలంగాణ జ్యోతి, ఏటూరు నాగారం :  లోతట్టు ప్రాంత ప్రజలు వరదలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని సమీప గ్రామాల ప్రజలు, జాలర్లు ఎవరు చాపల వేటకు వెళ్లకూడదని ఏటూరు నాగారం ఎస్సై ఎస్కే తాజుద్దీన్ అన్నారు. మండల కేంద్రంలో ని జంపన్నవాగు, గోదావరి వరద తీర ప్రాంతాలను గురు వారం సందర్శించారు. చాపల వేటకు వెళ్లిన వారితో సమావే శం ఏర్పాటు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోరుగా వానలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తడిసిన కరెంట్ పోల్స్, తడిసిన గోడలను ముట్టుకోవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పిఎఫ్ , పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment