ఘనంగా 77వ ఏబీవీపీ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు

ఘనంగా 77వ ఏబీవీపీ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు

ఘనంగా 77వ ఏబీవీపీ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు

– ములుగులో ర్యాలీ, జెండా ఆవిష్కరణ

ములుగు ప్రతినిధి, జూలై9, తెలంగాణ జ్యోతి :  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు శాఖ ఆధ్వర్యంలో 77వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై విద్యార్థులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి దేశభక్తి నినాదాలతో చుట్టూ మారుమోగించారు. వరంగల్ విభాగ్ సంఘటన మంత్రి గుండు పృద్వి చేతుల మీదుగా ఏబీవీపీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభలో పూర్వ ఏబీవీపీ నేతలు గండ్రకోట కుమార్, సంఘటన మంత్రి పృద్వి మాట్లాడారు. విద్యార్థుల హక్కుల కోసం పనిచేస్తున్న ఏకైక జాతీయవాద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని కొనియాడారు. 1949 జూలై 9న ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ సంఘం నేడు దేశవ్యాప్తంగా 56 లక్షల సభ్యులను కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి ఉద్యమంగా ఎదిగిందని తెలిపారు. విద్యా రంగ సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న ఏబీవీపీ, తెలంగాణ ఉద్యమంలో కూడా “నా రక్తం – నా తెలంగాణ” నినాదంతో 20వేల యూనిట్ల రక్తదానం చేసి ఉద్యమానికి ఊపిరి నింపిందని గుర్తు చేశారు. దేశ చరిత్రలో స్వామి వివేకానంద, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ జాతీయ భావాలను విద్యార్థుల్లో నాటేందుకు ఈ సంస్థ అహర్నిశలు కృషి చేస్తోందని వారు తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థి సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో నిలిచే ఏబీవీపీ, ప్రతి విద్యార్థి బాధను తనదిగా భావిస్తూ ఉద్యమాలు చేస్తోందని పేర్కొన్నారు. చివరిగా విద్యార్థినీ-విద్యార్థులకు 77వ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ, ప్రస్తుత ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక పాఠశాలలు, కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఘనంగా 77వ ఏబీవీపీ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment