మంత్రిని కలిసిన 5వ బెటాలియన్ అధికారులు
పెండింగ్ బిల్లుల పరిష్కారంపై మంత్రితో చర్చ
ములుగు, మార్చి 22, తెలంగాణ జ్యోతి: గోవిందరావుపేట మండలం చల్వాయి 5వ బెటాలియన్ అధికారులు ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 5వ బెటాలియన్ అధికారి బి. సీతారామ్ అదనపు కమాండెంట్ మంత్రి సీతక్క కార్యాలయం లో భేటీ అయి బెటాలియన్‌కు సంబంధించిన పరిపాలనా అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సిబ్బంది సంక్షేమంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బెటాలియన్ ఆర్‌ఐలు స్వామి, సాయిబాబు, ఏఆర్‌ఎస్‌ఐలు రత్నాకర్, నారాయణ పాల్గొన్నారు.








