ములుగులో ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ
ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ములుగు మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5 శాతం రాయితీ ప్రకటించినట్లు మున్సిపల్ కమిషనర్ టి. రమేష్ తెలిపారు. పన్ను మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన వారికి ఎర్లీ బర్డ్ సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలు ఉన్న వారు ముందుగా వాటిని చెల్లించిన తర్వాతే ఈ రాయితీ పొందగలరని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని పన్నులు చెల్లించాలని కోరుతూ, మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.









