వెంకటాపురం పట్టణంలో 45 నిఘా నేత్రాలు ఏర్పాటు. 

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం పట్టణంలో 45 నిఘా నేత్రాలు ఏర్పాటు. 

  • నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఏఎంపిఆర్ సీసీ కెమెరాల ఏర్పాటు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వెంకటాపురం పట్టణ కేంద్రంతో పాటు, వాజేడు మండల కేంద్రంలో కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిఘా నేత్రాలను పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశంపై ప్రధాన సెంటర్ పాయింట్లలో పోలీసులు సూచించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. నూగూరు వెంకటాపురం పట్టణ కేంద్రంలో ఏ. ఎం .పి .ఆర్. సీసీ కెమెరాలు ను వెంకటాపురం పట్టణ కేంద్రం శివాలయం వద్ద నుండి కనకదుర్గమ్మ దేవాలయం, నూగూరు రోడ్ పెట్రోల్ బంకు వరకు సుమారు 45 పైగా ఏఎంపీఆర్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావటం తో పాటు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు,దోపిడీ లు ఇతర నేరాలను నిఘానేత్రాలు ఎప్పటి కప్పుడు సంచరించే ,ఆయా ఆంశాలను చిత్రీకరించి పూర్తిస్థాయి ఆధారాలు సాక్షాలతో, లైవ్ అందించే విధంగా ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదేశంపై, వెంకటాపురం పోలీస్ అధికారుల పర్యవేక్షణలో వారు సూచించిన సీసీ కెమెరాల పాయింట్లలో నైపుణ్యం కలిగిన ప్రత్యేక సిబ్బంది, సీ.సీ. కెమెరాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికార్డింగ్( ఏ. ఎమ్. పి .ఆర్) నిఘానేత్రాల నైపుణ్యం కలిగిన ప్రత్యేక సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటులో నిబగ్నమయ్యారు. శివాలయం,వేప చెట్టు సెంటర్, రక్షకబట నిలయాల రోడ్ , బ్యాంకులు, బస్టాండ్లు, అంబేద్కర్ సెంటర్, మండల పరిషత్, విద్యుత్ సబ్స్టేషన్, కనకదుర్గమ్మ గుడి సెంటర్, ఇంకా అనేక రద్దీ ప్రాంతాల్లో అధికారుల సూచనలపై నైపుణ్యం కలిగిన కార్మికులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆయా సీసీ కెమెరాలు రికార్డింగ్,చిత్రీకరణ అయిన దృశ్యాల లైవ్ మాలికను రక్షకభట నిలయాల్లో ప్రత్యేక స్క్రీన్ పై ఎప్పటికప్పుడు దృశ్యమాలికలను, రక్షకభట అధికారులు, వీక్షిస్తుంటారు. అలాగే నేరాలు జరిగిన సమయంలో కూడా నిఘా నేత్రాలు వెంటనే రక్షకబటులనుఅప్రపతం చేసి అనేక ప్రజా రక్షణ ,బథ్రత ప్రయోజనాలతో ప్రజా భద్రత అంశాలతో, లా అండ్ ఆర్డర్ తో ముందుకు సాగేందుకు వీలుగా పోలీస్ యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటుకు, జిల్లా పోలీస్ అధికారుల ఆదేశంపై చక చకా ఏర్ఫటు చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. అలాగే వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండల కేంద్రంలో కూడా సీ.సీ. కెమెరాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అక్కడి పోలీస్ యంత్రాంగం,ఉన్నతాధికారులు ఆదేశం పై నైపుణ్యం కలిగిన కార్మికులతో ఏఎంపీఆర్ కెమెరాల ఏర్పాటుకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు్. ఒక నిఘానేత్రం అనేక ప్రయోజనాలు కలుగుతుందని, దానివలన ప్రజా బథ్రత ఇతర రక్షణ చర్యలకు, దోపిడీలు దొంగతనాలు కు సంచరించే లైవ్ దృశ్యమాలికలు కూడా సంచరించే వారిని కూడా చిత్రీకరించే దృశ్య గ్రాహక ఏ ఎం పి ఆర్ లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now