36 గంటల్లో సొంత గూటికి చేరిన బిఆర్ఎస్ ఎంపీటీసీ. 

36 గంటల్లో సొంత గూటికి చేరిన బిఆర్ఎస్ ఎంపీటీసీ. 

  • రాజకీయ వ్యూహంతో కాంగ్రెసు ను తిప్పికొట్టిన వాజేడు బిఆర్ఎస్ నేతలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతీ ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలం కృష్ణాపురం ఎంపీటీసీ యాలం చిట్టిబాబు మూడు రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ,భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య లు ఎన్నికల ప్రచారం పర్యటనలొ భాగంగా, మూడు రోజుల క్రితం ఆయా నేతల సమక్షంలో ఎంపిటిసి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. అయితే మనసు మార్చుకున్న టిఆర్ఎస్ ఎంపీటీసీ యాలం చిట్టిబాబు తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు సంకేతాలు పంపించారు. ఈ మేరకు వెంకటాపురం, వాజేడు మండలాల బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కన్వీనర్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదె బోయిన బుచ్చయ్య, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పి. కృష్ణారెడ్డి తదితరులు రాజకీయ వ్యూహంతో సొంతగూటికి చేరేందుకు కృష్ణాపురం ఎంపీటీసీ చిట్టిబాబును సొంత గూటీకి చేర్చుకునేందుకు ఒప్పించారు. ఈ మేరకు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యులు భద్రాచలం నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి ఎమ్మెల్సీ తాతా మధు సమక్షంలో భద్రాచలంలో బిఆర్ఎస్ నేతల సమక్షంలో ఎంపీటీసీ యాలం చిట్టిబాబు తిరిగి బీఆర్ఎస్ లో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అతనికి పార్టీ కండువాను ఎం.ఎల్సీ తాత మధు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్సీ యొక్క రాజకీయ వ్యూహాన్ని ప్రతి ప్పూహంతో వాజేడు, బిఆర్ఎస్ నేతలు తాము పార్టీ పరంగా త్రిప్పీ కొట్టామని బిఆర్ఎస్ నేతలు విలేకరులు కు తెలిపారు . ఎంపీటీసీ చిట్టిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలతో గ్రామ గ్రామాన అన్ని కుటుంబాలలో లబ్ధిదారులు ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ప్రభుత్వం తిరిగి అధికారం రావాలని ఆకాంక్షిస్తున్నారని, భద్రాచలం ప్రజా వైద్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు గ్రామాల్లో ప్రచార కథన రంగంలో తమ కార్యకర్తలతో, పార్టీ నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. సొంతగూటికి చేర్చుకోవడంతో, 36 గంటల్లో రాజకీయ ప్ఫ్యూహం, ప్రతి వ్యూహంతో టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. నేతలను ఆశ్చర్యపరిచే విధంగా వాజేడు బిఆర్ఎస్ నేతలు బోదెబోయిన బుచ్చయ్య, కృష్ణా రెడ్డి లు రాజకీయ చక్రం తిప్పడంలో ముందున్నారని, పార్టీ వర్గాలు, నేతలకు అభినందనలు తెలిపారు. పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు గెలుపు కోసం ప్రచార కథన రంగంలో పాల్గొంటానని ఎంపీటీసీ చిట్టిబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలోవాజేడు పార్టీ మండల అద్యక్షులు పి.క్రిష్ణారెడ్డీ , బి.బుచ్చయ్య , వెంకటాపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంపా రాంబాబు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజేడు మండలంలో వివిధ పార్టీలు కు చెందిన అనేకమంది కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని , పార్టీ ఎదుగు దలను, భద్రాచలం నియోజకవర్గం పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక  ప్రజల ఆధరణ లేనీ కాంగ్రెస్ పార్టీ నేతల కుటిల యత్నాలను ప్రజలు తిప్పీకోడుతున్నారని, ఈ సందర్భంగా బిఆర్ఎస్ నేతలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment