171 జీపీల్లో 224 అభ్యంతరాల తొలగింపు : డీపీవో దేవరాజ్
ములుగు, సెప్టెంబర్2, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా లోని 171 గ్రామపంచాయతీలలో తుది ఓటరు జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించినట్లు డీపీవో దేవరాజ్ తెలిపారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో అందుకు సంబంధించిన ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ.. ఈనెల 30న అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేశామని, పోలింగ్ స్టేషన్లు, ఫొటో ఎలక్ట్రోరల్ రోల్స్ పై 10మండలాల్లోని 171జీపీల్లో 224 అభ్యంతారలను స్వీకరించి పరిశీలించి తొలగించామన్నారు. జిల్లాలో 1536 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. తుది జాబితా అన్ని జీపీలు, ఎంపీడీవో కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంటా యన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవోలు, జీపీ కార్యర్శులు, పాల్గొన్నారు.