ములుగు సాక్షి రిపోర్టర్ భూక్య సునీల్ అంతిమ యాత్రలో నివాళులు
ములుగు ప్రతినిధి, జూన్ 5, తెలంగాణ జ్యోతి : సాక్షి రిపోర్టర్ భూక్య సునీల్ గురువారం తెల్లవారుఝామున అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన అంత్యక్రియలు స్వగ్రామం కొడిశలకుంటలో నిర్వహించాయి. అంతిమయాత్రలో ములుగు జిల్లా నుండి ప్రజా సంఘాల నాయకులు, సంఘటనల్లో పాల్గొని పుష్పాంజలులర్పించారు. సునీల్ మృదుస్వభావి, సేవాభావంతో పత్రికారంగంలో 15 ఏళ్లపాటు ప్రజలకోసం పనిచేశారని నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నక్క రాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జెఎస్సి చైర్మన్ ముంజాల భిక్షపతి, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కలువల రవీందర్, బిజెపి నాయకులు అట్లా రాజు, పొరిక పవన్, శరత్ తదితరులు పాల్గొన్నారు.