పాటల పల్లకిలో 12గంటలు పోస్టర్ ఆవిష్కరణ

పాటల పల్లకిలో 12గంటలు పోస్టర్ ఆవిష్కరణ

పాటల పల్లకిలో 12గంటలు పోస్టర్ ఆవిష్కరణ

ములుగు ప్రతినిధి : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 12న నిర్వహిస్తున్న పాలట పల్లకిలో 12గంటల కార్యక్రమ వాల్ పోస్టర్ ను ములుగు జిల్లా నిరుద్యోగ కళాకారుల అధ్యక్షుడు మోతె రమేష్ ఆదివారం ములుగులో ఆవిష్కరించారు. హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడి టోరియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమ కవి, గాయకులు నేర్నాల కిషోర్, టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల రఘు, ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర నేత అనువోజు వెంకటేశం నేతృత్వంలో జరుగుతుందన్నారు. పాటల పల్లకిలో 12 గంటల కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నామని, జిల్లాలోని కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. 12 గంటల పాటు జరిగే ఈ వేడుకను ఆస్వాదించాలన్నారు. ఈ కార్యక్రమం లో ఐక్యవేదిక నిరుద్యోగుల కళాకారుల సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల ఉపేంద్రం, ప్రధాన కార్యదర్శి గద్ధల రాజేందర్, పోరిక శ్యామల్, రామంచి రాణాప్రతాప్, అజ్మీర వెంక ట్రామ్, కంచం భద్రి, బొమ్మకంటి రజిత తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment