12 గంటల పని దినం శ్రామికులపై నిలువు దోపిడీ 

12 గంటల పని దినం శ్రామికులపై నిలువు దోపిడీ 

12 గంటల పని దినం శ్రామికులపై నిలువు దోపిడీ 

– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్

నారాయణపేట, ఆగస్టు2, తెలంగాణ జ్యోతి : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.282 ద్వారా 12 గంటల పని దినం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా విభీషించామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ అన్నారు. శనివారం నారాయణపేట సీఐటీయూ కార్యాలయంలో జరిగిన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వాలు 8 గంటల పని దినాన్ని ప్రభుత్వాలు రూపుమాపుతున్నాయని మండిపడ్డారు. గుజరాత్, కర్ణాటక తర్వాత తెలంగాణలో 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలన్న చర్యలు కార్మికులపై నిలువు దోపిడీ కింద పడతాయని విమర్శించారు. రూ. 16 లక్షల కోట్లను అంబానీ, అదానీ లాంటి బడా బాబులకు రైట్ ఆఫ్ చేసిన కేంద్ర ప్రభుత్వం, కార్మికులకు మాత్రం కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంలో అసమర్థంగా ఉందని భూపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లు యజమానులకు అనుకూలంగా మారాయని ఆరోపించారు. బహుళజాతి కంపెనీలకు సేవలందించే పాలక వర్గాలకు వ్యతిరేకంగా కార్మికులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 10న మక్తల్‌లో జరగనున్న అంగన్వాడీ, ఆశా వర్కర్ల మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, కార్యదర్శి బాల్‌రాం, ఉపాధ్యక్షుడు జోషి, అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, క్షేత్ర సహాయకుల సంఘాల నేతలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment