10th exams | టెన్త్ ఎగ్జామ్ ఫీజు తేదీలను వెల్లడించిన ఎస్ఎస్సి బోర్డు.
హైదరాబాద్ నవంబర్ 16 : పదవ తరగతి ఓఎస్ఎస్‌సీ ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు మార్చి 2024లో హాజరయ్యే విద్యార్థులు పరీక్షా ఫీజు తేదీలను ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ బుధవారం సాయంత్రం వెల్లడించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 2వ తేదీ నుండి 4వ తేదీలోగా ఫీజులు చెల్లించాలని తెలిపారు డిసెంబర్ 5 నుండి 8వ తేదీలోగా ప్రధాన ఉపాధ్యాయులు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నామినల్ రోల్స్ సమర్పించాలని పేర్కొన్నారు.50 రూపాయల అదనపు రుసుముతో డిసెంబర్ 12, 13 తేదీ వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు 200 రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ 21, 22వ తేదీల్లో రూ.500 అదనపు రుసుముతో వచ్చే ఏడాది జనవరి 3, 4వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మిగతా వివరాలకు వెబ్సైట్ www.bse.telangana.gov.in లో తెలుసుకోవాలని సూచించారు.