హోరెత్తిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి: ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణ శివారు,బిసి మర్రిగూడెం జిపిల లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ భద్రాచలం అభ్యర్థి పొదెం వీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ కార్యకర్తలు,నాయకులు పార్టీ ఆరు గ్యారంటీలు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈకార్యక్రమంలో సంబంధించిత ఇంచార్జులు చిడెం శివ, బాలసాని వేణు,ధనపనేని నాగరాజు,గాంధర్ల నాగేశ్వరరావు, కొండగొర్ల నాగేశ్వరరావు ఎమ్పిటిసిలు రవి, సీతాదేవి వార్డ్ మెంబర్ లు సరస్వతి, రమణయ్య, భూషణం,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “హోరెత్తిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.”