హరిహర నామాల మధ్య సిద్ధి లక్ష్మి అమ్మవారికి జలాభిషేకం.
– శ్రీ ఏకదంతా వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో భక్తుల సందడి.
– బెస్తగూడెం ఆలయంలో వెళ్లి విరిసిన భక్తి భావం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కార్తీకమాసంసందర్భంగా శ్రీ సిద్ది లక్ష్మి అమ్మవారికి శుక్రవారం పాలాభిషేకం ,జలాభిషేకాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నూట ఒక్క బిందెలతో జలాభిషేకం పూజా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, మహిళా భక్తురాళ్ళుతో ఆలయ పండితులు శాస్త్రోక్తంగా మంత్రోచ్ఛశ్చరణలమధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం పంచామృతాల ను, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. సకల జనులు సుఖ శాంతులతో ఉండాలని, పాడి, పంటలు సక్రమం గా పండాలని అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని, ఈ సందర్భంగా శ్రీ ఏకదంతా వరసిద్ధి వినాయక స్వామి, సిద్ది లక్ష్మి అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయా నికి వచ్చిన భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. నూట ఒక్క బిందెల తో జలాభిషేకం కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్తురాళ్ళు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయం వద్ద పాలాభిషేకం, జలా భిషేకం లతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు సందర్భంగా భక్తుల సందడి ఆలయం వద్ద నెలకొన్నది.